వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర ప్రాజెక్టులకు అనుమతులిస్తే దేశ జీడీపీకి తెలంగాణ 10 శాతం వాటా అందిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీకి తెలిపారు. ఇందుకోసం రెండు గంటలు కేటాయించి సమీక్షించాలని కోరారు. మెట్రో, మూసీ పునరుజ్జీవం వంటి కీలక ప్రాజెక్టులకు కేంద్ర సహకారం అత్యవసరమని ఆయన పేర్కొన్నారు.
అభివృద్ధిలో రాజకీయాలు ఉండకూడదని, వికసిత్ భారత్‌లో తెలంగాణ భాగస్వామి అవుతుందని రేవంత్ స్పష్టం చేశారు. గుజరాత్ తరహాలోనే తెలంగాణకు నిధులు ఇచ్చి ప్రోత్సహించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...
