Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చలో కలెక్టరేట్ ను విజయవంతం చేయండి

Follow Udayam on Google
K Anuradha Aug 20, 2026 1:12 PM శ్రీకాకుళంGeneral
చలో కలెక్టరేట్ ను విజయవంతం చేయండి - Udayam
దళితుల నివాస ప్రాంతాల్లో సమస్యలు పరిష్కరించాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు సిర్ల ప్రసాద్ కోరారు. ఆగస్టు 24న చేపట్టనున్న ఛలో కలెక్టరేట్‌ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. గురువారం హిరమండలంలో కరపత్రాలు విడుదల చేశారు. దళిత కాలనీల్లో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. తాగునీరు, రహదారుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...