Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసుపత్రిలో స్వచ్ఛమైన తాగునీరు అందించాలి

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Jun 25, 2026 5:27 PM ఆసిఫాబాద్General
ఆసుపత్రిలో స్వచ్ఛమైన తాగునీరు అందించాలి - Udayam
కాగజ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఆర్.ఓ. వాటర్ ప్లాంట్‌ను జిల్లా కలెక్టర్ కె.హరిత ప్రారంభించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు, ప్రజలకు నాణ్యమైన తాగునీటిని అందించేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆమె సూచించారు. అనంతరం బాలాజీ నగర్‌లో జరుగుతున్న ఎన్యుమరేషన్ ఫారాల ప్రక్రియను ఆమె పరిశీలించారు. ఫారాల్లోని వివరాలను యాప్‌లో స్పష్టంగా నమోదు చేయాలని బూత్ స్థాయి అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

Comments

G
Loading comments...