Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిరుత సంచారంతో పల్సిలో భయాందోళన

Follow Udayam on Google
Kiran Oct 07, 2026 11:39 AM ఆదిలాబాద్General
చిరుత సంచారంతో పల్సిలో భయాందోళన - Udayam
నిర్మల్‌ జిల్లా కుబీర్‌ మండలం పల్సి గ్రామంలో చిరుత సంచారం కలకలం రేపింది. రైతు తావుటి రాములు తన పొలంలో జంతువు అడుగుజాడలను గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. పరిశీలించిన అధికారులు అవి చిరుత అడుగులేనని నిర్ధారించారు. దీంతో గ్రామస్తుల్లో భయాందోళన నెలకొంది. రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పొలాల్లోకి ఒంటరిగా వెళ్లవద్దని అటవీశాఖ అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...