Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిరుత పులి సంచారం.. రైతుల్లో ఆందోళన

Follow Udayam on Google
Naresh Oct 06, 2026 5:58 PM నిర్మల్ General
నిర్మల్ జిల్లా కుబీర్ మండలం పల్సి గ్రామంలో చిరుత పులి సంచారం కలకలం రేపింది. మంగళవారం రైతు తావుటి రాములు తన వ్యవసాయ క్షేత్రంలో జంతువు అడుగుజాడలను గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న అటవీశాఖ అధికారి శివప్రసాద్ అడుగుజాడలను పరిశీలించి అవి చిరుత పులివిగా నిర్ధారించారు. దీంతో రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...