Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిరుమర్రిలో రక్తదానం శిబిరం ఏర్పాటు

Follow Udayam on Google
Kasanivenkatesh Aug 16, 2026 5:17 PM ఖమ్మంGeneral
చిరుమర్రిలో రక్తదానం శిబిరం ఏర్పాటు - Udayam
రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారి ప్రాణాలు కాపాడాలని ప్రముఖ సేవకులు రామినేని రాకేష్ అన్నారు. తలసేమియా వ్యాధిగ్రస్తుల సౌకర్యార్థం ఆదివారం ముదిగొండ మండలం చిరుమర్రిలో రక్తదానం శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో స్థానిక యువత, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. రక్తదానం చేసిన యువత, ప్రజలకు నిర్వాహకులు సర్టిఫికెట్లు అందజేశారు. సేకరించిన రక్తాన్ని తలసేమియా వ్యాధిగ్రస్తులకు అందిస్తామని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...