వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్నగొట్టిగల్లు మండలం చిట్టేచర్ల పంచాయతీ తుమ్మచేనుపల్లెలో బుధవారం ఉదయం ఒంటరి ఏనుగు కలకలం రేపింది. ఉదయం 5 గంటలకు హరిప్రసాద్ పొలంలోకి ఏనుగు ప్రవేశించడంతో దాన్ని తరిమేందుకు వెళ్లిన ఆయన ప్రమాదవశాత్తు కాలువలో పడి కాలికి తీవ్ర గాయమైంది.
కుటుంబ సభ్యులు హరిప్రసాద్‌ను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స అందిస్తున్నారు.
Comments
Loading comments...

