Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్నారుల మృతిపై ఎమ్మెల్యే కళా వెంకటరావు దిగ్భ్రాంతి

Follow Udayam on Google
B. Rajesh Sep 27, 2026 12:14 PM విజయనగరంఆంధ్రప్రదేశ్
చిన్నారుల మృతిపై ఎమ్మెల్యే కళా వెంకటరావు దిగ్భ్రాంతి - Udayam
బుదరాయవలస గ్రామంలో శనివారం సాయంత్రం ముగ్గురు చిన్నారులు మృతి చెందిన ఘటనపై ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తన మనసును కలచివేసిందని తెలిపారు. పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులకు భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని కోరారు. సెలవుల్లో పిల్లలు చెరువులు, కుంటల వద్దకు వెళ్లకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఘటనపై అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.

Comments

G
Loading comments...