వార్తలకు తిరిగి వెళ్లండి

అశ్వాపురం మండలం బుడుగు బజారుకు చెందిన సాయిని రోహిత్ ప్రమాదంలో గాయపడి ఖమ్మంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న మణుగూరు కమ్మ మహాజన సేవా సంఘం సభ్యులు కుటుంబానికి అండగా నిలిచారు.
చిన్నారి వైద్య ఖర్చుల కోసం రూ.47 వేల ఆర్థిక సాయం అందించారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. సంఘం అధ్యక్షుడు వెంకట రాంబాబు, ప్రధాన కార్యదర్శి సతీశ్ కుమార్, శంకర్, చెన్నకేశవరావు పాల్గొన్నారు.
Comments
Loading comments...

