వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా చీపురుపల్లి మేజర్ పంచాయతీ పరిధిలో బుధవారం శానిటరీ ఇన్స్పెక్టర్ రామ్మోహనరావు పర్యవేక్షణలో పలు కాలనీలలో స్వచ్చ పథం నిర్వహించారు.
ఈ మేరకు పారిశుద్ధ్య కార్మికులు ఇంటింటికీ తిరిగి తడి, పొడి చెత్తను సేకరించారు. అనంతరం పరిసరాలను పరిశుభ్రం చేశారు. సేకరించిన చెత్తను ట్రాక్టర్ల ద్వారా చెత్త కేంద్రాలకు తరలించి వేరుచేసి ఎరువులు తయారు చేస్తామని, ప్రజలు పంచాయతీకి సహకరించాలని ఈ సందర్భంగా కోరారు.
Comments
Loading comments...

