వార్తలకు తిరిగి వెళ్లండి

ముస్తాబాద్‌లోని ఒక ప్రైవేటు పాఠశాలలో నర్సరీ చదువుతున్న 4 ఏళ్ల చిన్నారి ఇజోమెహ్రిన్ మృతి చెందింది. పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ ప్రాణాలు కోల్పోయిందని తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చేపట్టారు.
ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు, సీసీ కెమెరాలను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. చిన్నారి మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు కేసు నమోదు చేసి సమగ్ర విచారణను పోలీసులు ప్రారంభించారు.
Comments
Loading comments...

