వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం కనకాపూర్‌లో దారుణం జరిగింది. అమ్మమ్మ వద్ద నిద్రిస్తున్న 8 ఏళ్ల బాలిక అయేషాఖానంపై ఇంటి స్లాబు పెచ్చులు పడటంతో ఆమె తీవ్రంగా గాయపడి మృతి చెందింది.
బుధవారం వేకువజామున ఈ ఘటన చోటుచేసుకుంది. చిన్నారిని వెంటనే ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన గ్రామస్థులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది.
Comments
Loading comments...

