వార్తలకు తిరిగి వెళ్లండి

చెన్నూరులో పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది. నల్లగొండపోచమ్మవాడ, శిశుమందిర్ ఏరియా తదితర ప్రాంతాల్లో ప్రజలపై దాడి చేయడంతో పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల్లో చిన్నారులు కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. వారందరినీ స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మున్సిపల్ అధికారులు నిధులు కేటాయించినా, వీధి కుక్కల నియంత్రణలో విఫలమయ్యారని కౌన్సిలర్లు మండిపడ్డారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని, తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Loading comments...

