వార్తలకు తిరిగి వెళ్లండి
రథయాత్రలో ప్రమాదం: ఇద్దరు మృతి

ఝార్ఖండ్‌లోని ఖుంటి జిల్లా టోర్పాలో జగన్నాథుడి రథయాత్రలో ఘోర ప్రమాదం జరిగింది. నిలిపి ఉంచిన రథానికి 11,000 వోల్టుల విద్యుత్ తీగ తాకడంతో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మరణించారు.
ఈ ప్రమాదంలో మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...