వార్తలకు తిరిగి వెళ్లండి
నేడు కర్నూలులో సీఎం చంద్రబాబు పర్యటన
పవన్ కుమార్ Jun 25, 2026 2:10 AM కర్నూలు 17 views1 day ago

సీఎం చంద్రబాబు నాయుడు నేడు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. మంత్రాలయం మండలం మాధవరంలో జరిగే పార్టీ సమావేశానికి హాజరై, నాయకులు మరియు కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో స్థానిక అధికార యంత్రాంగం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసింది.
సమావేశం అనంతరం సీఎం ప్రముఖ పుణ్యక్షేత్రమైన రాఘవేంద్రస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆయన పర్యటన కోసం పార్టీ శ్రేణులు సిద్ధమయ్యాయి.
Comments
Loading comments...