Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వట్టిపల్లిలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

Follow Udayam on Google
Anuroop Sep 26, 2026 1:14 PM సిద్దిపేటGeneral
వట్టిపల్లిలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు - Udayam
జగదేవ్‌పూర్ మండలం వట్టిపల్లిలో శనివారం రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అణగారిన వర్గాల హక్కులు, ఆత్మగౌరవం కోసం ఐలమ్మ చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని రజక సంఘం అధ్యక్షుడు బిక్షపతి, ఉపాధ్యక్షుడు ఉప్పలయ్య అన్నారు. కార్యక్రమంలో గణేశ్, దుర్గయ్య, కరుణాకర్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...