వార్తలకు తిరిగి వెళ్లండి
జగిత్యాల పట్టణంలోని 9వవార్డు పద్మనాయక ఫంక్షన్ హాల్ ప్రక్క వీధిలో విద్యుత్ శాఖవారు లైన్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలు తొలగించి 5 రోజులు కావస్తున్నా, మున్సిపల్ సిబ్బంది ఇంకా తొలగించడం లేదు. దీనితో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.
అధికారుల పరస్పర సమన్వయ లోపంతో జరిగిందని శాంతినగర్ కాలనీ వాసులు భావిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తక్షణం స్పందించి చెట్ల కొమ్మలు తొలగించాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

