వార్తలకు తిరిగి వెళ్లండి
సెస్నా విమానం కూలి 10 మంది మృతి

ఉత్తర అమెరికాలోని బహమాస్ దీవుల్లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. నసావు నుంచి శాన్ ఆండ్రోస్‌కు బయలుదేరిన ఫ్లెమింగో ఎయిర్‌కు చెందిన 'సెస్నా-402' చిన్న విమానం నార్త్ ఆండ్రోస్ సమీపంలో కూలిపోవడంతో 10 మంది దుర్మరణం పాలయ్యారు.
ఈ ప్రమాద తీవ్రత నేపథ్యంలో సదరు విమానయాన సంస్థ ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికేట్‌ను ప్రభుత్వం తాత్కాలికంగా రద్దు చేసింది. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై బహామియన్ దర్యాప్తు సంస్థ విచారణ చేపట్టింది.
Comments
Loading comments...