వార్తలకు తిరిగి వెళ్లండి

హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు 60 పైసల అనాథ, వితంతు సెస్ విధించింది. కొత్త ధరలు అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి.
ఈ సెస్ ద్వారా వచ్చే ఆదాయాన్ని అనాథ పిల్లలు, వితంతువుల సంక్షేమ పథకాలకు వినియోగించనున్నారు. అయితే పెరిగిన ఇంధన ధరలతో నిత్యావసరాల రవాణా వ్యయం పెరుగుతుందని బీజేపీ నేత రాకేశ్ జమ్వాల్ విమర్శించారు.
Comments
Loading comments...

