Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెరకు పరిశ్రమ కాపాడేందుకు సహకరించాలి

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 04, 2026 6:19 PM విజయనగరంGeneral
చెరకు పరిశ్రమ కాపాడేందుకు సహకరించాలి - Udayam
విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల చెరకు రైతులకు ఆధారమైన సంకిలి చక్కెర పరిశ్రమను కాపాడుకునేందుకు సహకరించాలని బొబ్బిలి MLA బేబినాయన ను రైతు సంఘాల నాయకులు, రైతులు కోరారు. శుక్రవారం బొబ్బిలి కోటలో ఆయనను కలిసి వారి సమస్యలను వివరించారు. పరిశ్రమను తాత్కాలిక లాకౌట్‌ చేస్తామని యాజమాన్యం ప్రకటించడంతో రైతులకు నష్టం జరుగుతుందని, పరిశ్రమను నడిపించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...