Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెరబండ రాజు కాలనీలో ఉద్రిక్తత

Follow Udayam on Google
Kiran Oct 07, 2026 10:22 AM వరంగల్General
వరంగల్ నగరంలోని భద్రకాళి ఆలయ సమీపంలోని చెరబండ రాజు కాలనీలో అధికారులు ఇళ్ల కూల్చివేత చేపట్టారు. అర్ధరాత్రి పోలీసులు, స్పెషల్ పార్టీ బలగాలు భారీగా మోహరించడంతో ఉద్రిక్తత నెలకొంది. కూల్చివేతను కాలనీవాసులు అడ్డుకున్నారు. పోలీసులతో మహిళలు వాగ్వాదానికి దిగినట్లు తెలిపారు. కొందరు నిరుపేదలను పోలీసులు అదుపులోకి తీసుకుని మట్టెవాడ పోలీస్ స్టేషన్‌కు తరలించారని, అక్కడ బాధితులు ఆందోళన చేపట్టారని సమాచారం.

Comments

G
Loading comments...