వార్తలకు తిరిగి వెళ్లండి

చెన్నూరు ఎంపీడీవో కార్యాలయంలో ఈనెల 22 నుంచి 25వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు ఆధార్ క్యాంపు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో ఎన్. వరప్రసాద్ రెడ్డి తెలిపారు. మండల ప్రజలు, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
క్యాంపులో ఆధార్‌లో పేరు, చిరునామా మార్పులు, మొబైల్ నంబర్ అనుసంధానం, బయోమెట్రిక్ నవీకరణ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ప్రజలు తమ ఆధార్ వివరాలను అప్‌డేట్ చేసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

