Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెంచుగుడిలో కుక్కల దాడి...ఆరు పొట్టేళ్లు మృతి

Follow Udayam Digital on Google
M S Balaji Jul 29, 2026 11:51 AM చిత్తూరుక్రైమ్
వెదురుకుప్పం మండలం, చెంచుగుడి గ్రామంలో వీధికుక్కలు రెచ్చిపోవడంతో తీవ్ర కలకలం నెలకొంది. గ్రామానికి చెందిన రైతు మోహన్ రెడ్డి పెంచుకుంటున్న పొట్టేళ్లపై కుక్కల గుంపు దాడి చేసి ఆరు పొట్టేళ్లను చంపేశాయి. ఈ ఘటనతో పశుపోషకుడు తీవ్ర ఆర్థిక నష్టాన్ని చవిచూశాడు.గ్రామంలో వీధికుక్కల బెడద రోజురోజుకూ పెరుగుతోందని, పశువులతో పాటు ప్రజలు కూడా భయాందోళనకు గురవుతున్నారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి వీధికుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టి, బాధిత రైతుకు తగిన నష్టపరిహారం అందించాలని గ్రామస్థులు కోరుతున్నారు..

Comments

G
Loading comments...