Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెల్లని చెక్కు కేసులో ఏడాది జైలు

Follow Udayam on Google
Kiran Sep 16, 2026 10:25 AM ఖమ్మంGeneral
చెల్లని చెక్కు కేసులో ఏడాది జైలు - Udayam
ముదిగొండ మండలం వెంకటాపురానికి చెందిన పోడకండ్ల రామారావుకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ ఖమ్మం ఒకటో ప్రథమశ్రేణి కోర్టు తీర్పు ఇచ్చింది. ఫిర్యాదుదారుడు రాయల వెంకటేశ్వర్లుకు రూ.8.26 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. 2018లో వెంకటేశ్వర్లు వద్ద రామారావు రూ.5.10 లక్షలు తీసుకున్నారు. 2021లో రుణ చెల్లింపులో ఇచ్చిన చెక్కు నగదు లేక తిరస్కరణకు గురైంది. కోర్టు విచారణలో నేరం రుజువైంది.

Comments

G
Loading comments...