వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వంలో పని చేస్తూ ప్రజలకు చేసిన సేవలే ప్రభుత్వ ఉద్యోగికి మంచి గుర్తింపును ఇస్తాయని వైసీపీ నేత, జడ్పీటీసీ ధర్మాన కృష్ణ చైతన్య తెలిపారు.
సోమవారం పోలాకి మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా పనిచేసిన జి.వి రవికుమార్ పదవీ విరమణ సందర్భంగా ఆయనను కలిసి అభినందించారు. ఆయన మాట్లాడుతూ పరిపాలనలో తనకంటూ ఒక ప్రత్యేకతను ఆయన చాటుకున్నారని కితాబు ఇచ్చారు. ఆయనతోపాటు పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

