వార్తలకు తిరిగి వెళ్లండి

చదువుతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని దండేపల్లి మండలంలోని గుడిరేవు గ్రామ సర్పంచ్ సంతపురి కళావతి సూచించారు. ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా మంగళవారం గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో వయోజన విద్య వాలంటీర్లను శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.
చదువుతోనే ప్రతి ఒక్కరి అభివృద్ధి సాధ్యమని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మడిపల్లి అఖిల, సెక్రెటరీ రవికుమార్, వార్డు సభ్యులు తదితరులు ఉన్నారు.
Comments
Loading comments...

