Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిబంధనలకు విరుద్ధంగా గృహ ప్రవేశాలు.. మాజీ మంత్రి ధర్మానపై కేసు

Follow Udayam on Google
SHRUTHI Aug 30, 2026 10:03 AM శ్రీకాకుళంGeneral
నిబంధనలకు విరుద్ధంగా గృహ ప్రవేశాలు.. మాజీ మంత్రి ధర్మానపై కేసు - Udayam
ప్రభుత్వ ఇళ్లలో నిబంధనలకు విరుద్ధంగా గృహ ప్రవేశాలు నిర్వహించారన్న ఫిర్యాదుతో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుపై శ్రీకాకుళం గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేశారు. కుందువానిపేటలో హుద్‌హుద్‌ బాధితుల కోసం నిర్మించిన ఇళ్లలో మే 14న బలవంతంగా గృహ ప్రవేశాలు నిర్వహించారని గృహనిర్మాణ శాఖ డీఈఈ ఫిర్యాదు చేశారు. ధర్మానతోపాటు జడ్పీటీసీ సభ్యురాలు రుప్ప దివ్య, ఆరుగురు మత్స్యకారులపైనా కేసు నమోదైంది.

Comments

G
Loading comments...