Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పొలాల్లోకి దూసుకెళ్లిన కారు

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 19, 2026 2:26 PM కాకినాడGeneral
పొలాల్లోకి దూసుకెళ్లిన కారు - Udayam
పిఠాపురం పట్టణ బైపాస్‌ రోడ్డులో బుధవారం ఉదయం ఓ కారు అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ఉదయం వర్షం కురవడంతో ప్రమాద స్థలానికి వెంటనే ఎవరూ చేరుకోలేకపోయారు. స్థానికుల వివరాల ప్రకారం ఉదయం 5 నుంచి 8 గంటల మధ్య ప్రమాదం జరిగి ఉండొచ్చని తెలుస్తోంది. అయితే, కారులో ఎంతమంది ఉన్నారు, ఎవరైనా గాయపడ్డారా అనే వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పూర్తి సమాచారం వెల్లడి కావాల్సి ఉంది.

Comments

G
Loading comments...