Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కారు అద్దెకు తీసుకుని పరారైన వ్యక్తి

Follow Udayam on Google
స్వప్న రెడ్డి Jun 24, 2026 10:23 AM నిజామాబాద్General
కారు అద్దెకు తీసుకుని పరారైన వ్యక్తి - Udayam
నగరంలో ఒక వ్యక్తి కారును కిరాయికి తీసుకుని, డ్రైవర్‌ను అరటిపండ్లు తీసుకురావడానికి పంపాడు. డ్రైవర్ వాహనం దిగి వెళ్లిన సమయంలో, కిరాయికి వచ్చిన వ్యక్తి కారును తీసుకుని సినీ ఫక్కీలో ఉడాయించాడు. ఈ ఘటనపై బాధితుడు కుద్రిత్‌ బేగ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...