వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజలకు ప్రభుత్వ సేవలు సులువుగా అందించేందుకు వీలుగా బిజినెస్ నిబంధనలను సవరించాలని ఏపీ సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఉండవల్లిలో ఆర్టీజీఎస్, ఇతర శాఖల పనితీరుపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఏడాదిలోగా రెవెన్యూ సమస్యలన్నింటినీ పూర్తిగా పరిష్కరించాలని స్పష్టం చేశారు.
కుటుంబ తగాదాలు, కుల ధ్రువీకరణ పత్రాల జారీ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఆసుపత్రుల సేవల్లో నిర్లక్ష్యం వహించకూడదని, సైబర్ నేరాల అదుపునకు పటిష్ఠ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు.
Comments
Loading comments...
