వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదోని పురపాలక వాణిజ్య సముదాయానికి సంబంధించి రెండో విడత నగదు చెల్లించాలని పురపాలక సంఘం నోటీసులు జారీ చేసింది. దీనిపై వేలంలో దుకాణాలు పొందిన వ్యాపారులు పురపాలక సహాయ కమిషనర్ నాసిర్ హుస్సేన్‌ను కలిసి అభ్యంతరం వ్యక్తం చేశారు.
దుకాణాల నిర్మాణం పూర్తికాకముందే చెల్లింపులు కోరడం సరికాదని, ముందుగా ఒప్పందం చేయాలని వారు కోరారు. ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సహాయ కమిషనర్ తెలిపారు.
Comments
Loading comments...

