వార్తలకు తిరిగి వెళ్లండి

నల్గొండ జిల్లా పెద్దకాపర్తి వద్ద హైదరాబాద్ నుండి కాకినాడ వెళ్తున్న ప్రైవేట్ బస్సులో తెల్లవారుజామున ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. బస్సు ఇంజిన్ నుండి పొగలు రావడాన్ని గమనించిన డ్రైవర్, క్లీనర్ వెంటనే అప్రమత్తమై ప్రయాణికులను కిందికి దించడంతో 36 మంది సురక్షితంగా బయటపడ్డారు.
సమయస్ఫూర్తితో అందరూ కిందకు దిగిన కొద్దిసేపటికే మంటలు తీవ్రరూపం దాల్చి బస్సు పూర్తిగా కాలిబూడిదైంది. సమయానికి డ్రైవర్ తీసుకున్న నిర్ణయం వల్ల పెద్ద ప్రాణనష్టం తప్పిందని పోలీసులు, స్థానికులు తెలిపారు.
Comments
Loading comments...

