Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కారేపల్లిలో చోరీ: నిద్రిస్తుండగా దోచుకెళ్లిన దుండగులు

Follow Udayam on Google
Harika Jun 22, 2026 12:27 PM ఖమ్మంGeneral
కారేపల్లిలో చోరీ: నిద్రిస్తుండగా దోచుకెళ్లిన దుండగులు - Udayam
ఖమ్మం జిల్లా కారేపల్లిలో ఆదివారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. కేతుమల్ల సారయ్య కుటుంబం ఇంటి ముందు నిద్రిస్తుండగా, దుండగులు వెనుక తలుపుల ద్వారా లోనికి ప్రవేశించారు. బీరువా పగలగొట్టి ఐదు తులాల బంగారం, వెండి, నగదును ఎత్తుకెళ్లారు. ఉదయం లేచిన బాధితులు చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...