వార్తలకు తిరిగి వెళ్లండి

ఉంగుటూరులో కిరాణా వ్యాపారి చొప్పెర లక్ష్మణస్వామి, సుబ్బలక్ష్మి వృద్ధ దంపతుల ఇంట్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. తలుపు గడి పగలగొట్టి బీరువాలోని రూ.50 వేల నగదుతో పాటు బంగారు, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు.
ఈ చోరీలో సుమారు రూ.2.5 లక్షల సొత్తు పోయినట్లు అంచనా వేశారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా, క్లూస్‌టీం మరియు జాగిలాలతో ఆధారాలు సేకరించారు.
Comments
Loading comments...

