వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ శివారులోని రేకుర్తి కెనాల్ రహదారి ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిని గుంతలమయంగా మారింది. ఉదయం విద్యార్థుల స్కూల్ బస్సు బురదలో చిక్కుకోవడంతో ఆగ్రహించిన స్థానికులు నీటిలోనే బైఠాయించి ధర్నా చేశారు.
వందలాది కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నందున, అధికారులు వెంటనే స్పందించి శాశ్వత రోడ్డు నిర్మించాలని స్థానికుడు ఎండీ సైఫ్ డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

