Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బుద్దారంలో 150 మందికి కంటి పరీక్షలు

Follow Udayam on Google
K.Venkatesh Sep 20, 2026 3:12 PM ఖమ్మంGeneral
బుద్దారంలో 150 మందికి కంటి పరీక్షలు - Udayam
భక్త రామదాసు సొసైటీ, వైరా లయన్స్ కంటి హాస్పిటల్ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం బుద్దారంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఘనంగా జరిగింది. సర్పంచ్ సత్యం రిబ్బన్ కట్ చేసి క్యాంప్ ను ప్రారంభించారు. 15 ఏళ్లుగా కంటి వెలుగునిస్తున్న లయన్స్ హాస్పిటల్ సేవలని ప్రశంసించారు. శిబిరంలో 150 మందికి పరీక్షలు చేసి, 25 మందిని ఉచిత ఆపరేషన్లకు ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు సొసైటీ బాధ్యులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...