Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజాధనం వృథాపై బీఎస్పీ ఆరోపణలు

Follow Udayam on Google
శిరీష గౌడ్ Aug 07, 2026 5:12 PM అనకాపల్లి General
ప్రజాధనం వృథాపై బీఎస్పీ ఆరోపణలు - Udayam
జీవీఎంసీ అధికారుల నిర్లక్ష్యంతో ప్రజాధనం వృథా అవుతోందని బీఎస్పీ జిల్లా ఇన్‌ఛార్జ్ సూదికొండ మాణిక్యాలరావు ఆరోపించారు. అనకాపల్లి జీవీఎంసీ కార్యాలయంలో లక్షల రూపాయల విలువైన సెప్టిక్ క్లీనింగ్ వాహనం మరమ్మతుల పేరుతో నెలలుగా నిరుపయోగంగా ఉండటాన్ని ఆయన పరిశీలించారు. చిన్నపాటి మరమ్మతులు చేయకుండా ప్రభుత్వ వాహనాలను పక్కన పెట్టడం వల్ల ప్రజాధనం వృథా అవుతోందని, ప్రజలకు సేవలు అందడం లేదని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...