Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ ఘాటు స్పందన

Follow Udayam on Google
దివ్య శ్రీ Jul 01, 2026 11:18 AM హైదరాబాద్General
సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ ఘాటు స్పందన - Udayam
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మానసిక స్థితిపై తమకు అనుమానంగా ఉందని బీఆర్‌ఎస్ నేత రావుల శ్రీధర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత కొంతకాలంగా రేవంత్ రెడ్డి కేసీఆర్ గురించే తీవ్ర ఆలోచనల్లో మునిగిపోతున్నారని ఆయన విమర్శించారు. ప్రభుత్వ లేదా ప్రైవేట్ కార్యక్రమం ఏదైనా, విద్యార్థులు లేదా ఉద్యోగుల సమావేశమైనా సరే.. రేవంత్ రెడ్డి ప్రతి వేదికను కేసీఆర్‌ను తిట్టడానికే వాడుకుంటున్నారని మండిపడ్డారు. కారణం లేకుండా కేసీఆర్‌ను విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఆయన ధ్వజమెత్తారు.

Comments

G
Loading comments...