వార్తలకు తిరిగి వెళ్లండి
కేయూలో బీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ‘గిఫ్ట్ ఏ స్మైల్’ స్ఫూర్తితో కాకతీయ యూనివర్సిటీలో ఈ నెల 22, 23, 24 తేదీల్లో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు బీఆర్‌ఎస్వీ నాయకులు తెలిపారు.
ఈ వేడుకల్లో భాగంగా మొదటి రోజు పండ్ల పంపిణీ, రెండో రోజు గ్రీన్ ఇండియా ఛాలెంజ్, చివరి రోజు కేయూ లైబ్రరీ విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్‌ఎస్వీ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...