వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం 8వ డివిజన్‌లో నూతనంగా నిర్మించిన గులాబీ గద్దెను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన వారు దీనిపై ఆందోళన నిర్వహించారు.
రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కొనే ధైర్యం లేకే ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ నాయకుడు పగడాల నాగరాజు విమర్శించారు. ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

