Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జైనథ్‌లో బీఆర్ఎస్ నిరసన

Follow Udayam on Google
Kiran Sep 07, 2026 4:56 PM ఆదిలాబాద్General
జైనథ్‌లో బీఆర్ఎస్ నిరసన - Udayam
కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో పూర్తి చేస్తామన్న హామీల్లో ఒక్కటీ పూర్తిగా అమలు కాలేదని మాజీ ఎంపీపీ మార్షెట్టి గోవర్ధన్ అన్నారు. ఎంపీడీవో కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ శ్రేణులు నిరసన తెలిపి, ప్రజావాణిలో వినతిపత్రం అందించారు. ఆరు గ్యారంటీల అమలులో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని గోవర్ధన్ ఆరోపించారు. కార్యక్రమంలో గణేష్ యాదవ్, వెంకట్ రెడ్డి, దేవన్న, అడేళ్లు, లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...