Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం నివాసం ముట్టడికి బీఆర్‌ఎస్ యత్నం

Follow Udayam on Google
రచన దేవి Jul 13, 2026 5:55 PM హైదరాబాద్General
సీఎం నివాసం ముట్టడికి బీఆర్‌ఎస్ యత్నం - Udayam
ఎల్‌నినో తీవ్రతతో ఎండలు మండుతున్నా.. రైతులకు సాగునీరు అందించడంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బీఆర్‌ఎస్ నేత పుట్టా విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. ముఖ్యమంత్రి నివాస ముట్టడికి దూసుకెళ్లిన బీఆర్‌ఎస్ శ్రేణులను పోలీసులు అడ్డుకుని, అక్రమంగా అరెస్టు చేశారు. కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని ఎత్తిపోయకుండా.. లక్ష క్యూసెక్కుల గోదావరి జలాలను రేవంత్ సర్కార్ వృథాగా సముద్రం పాలు చేస్తోందని ఆయన ఆరోపించారు.

Comments

G
Loading comments...