Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తమ్ముడి హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించిన అన్న

Follow Udayam on Google
Harika Aug 22, 2026 1:06 PM ములుగు General
తమ్ముడి హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించిన అన్న - Udayam
ములుగు జిల్లా వాజేడు మండలంలో మద్యం తాగి వేధిస్తున్న తమ్ముడు రాంబాబును అన్న జానకీరావు హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. నిద్రిస్తున్న సమయంలో కొడవలితో గొంతుపై దాడి చేయడంతో రాంబాబు మృతి చెందినట్లు వెల్లడించారు. అనంతరం మృతుడి చేతిలో రంపం పెట్టి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా దర్యాప్తు చేసి జానకీరావును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Comments

G
Loading comments...