Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.18.5 కోట్లు మంజూరైనా మొదలుకాని వంతెన పనులు

Follow Udayam on Google
Harika Aug 20, 2026 11:34 AM యాదాద్రి భువనగిరిGeneral
రూ.18.5 కోట్లు మంజూరైనా మొదలుకాని వంతెన పనులు - Udayam
బీబీనగర్‌ మండలం రుద్రవెళ్లి వద్ద మూసీ నదిపై వంతెన నిర్మాణం ఇంకా పూర్తికాలేదు. ఇటీవల భువనగిరి ఎమ్మెల్యే వంతెన నిర్మాణానికి రూ.18.5 కోట్లు మంజూరైనట్లు ప్రకటించినా పనులు మాత్రం ప్రారంభం కాలేదు. ప్రభుత్వాలు మారుతున్నా వంతెన నిర్మాణం పూర్తికాకపోవడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే చొరవ తీసుకుని పనులు వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...