Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫోన్‌పే ద్వారా లంచం.. ఏసీబీకి చిక్కిన కార్యదర్శి

Follow Udayam on Google
Harika Aug 22, 2026 11:30 AM మంచిర్యాలGeneral
ఫోన్‌పే ద్వారా లంచం.. ఏసీబీకి చిక్కిన కార్యదర్శి - Udayam
మంచిర్యాల జిల్లా జన్నారం మండలం లింగయ్యపల్లి పంచాయతీ కార్యదర్శి వరలక్ష్మి రూ.13 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీకి పట్టుబడ్డారు. గృహనిర్మాణం, ఇంటి నంబర్‌ కోసం రూ.15 వేలు డిమాండ్‌ చేసి రూ.13 వేలకు ఒప్పుకున్నారని డీఎస్పీ మధు తెలిపారు. నగదు బదులు స్నేహితురాలి ఫోన్‌పే నంబర్‌కు డబ్బులు పంపించాలని ఆమె సూచించారని తెలిపారు. బాధితుడి ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు వలపన్ని ఆమెను పట్టుకున్నారు.

Comments

G
Loading comments...