Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీటి డ్రమ్ములో పడి ఆరేళ్ల బాలుడు మృతి

Follow Udayam on Google
రాజిత దేవి Aug 01, 2026 3:59 PM నారాయణపేటGeneral
నీటి డ్రమ్ములో పడి ఆరేళ్ల బాలుడు మృతి - Udayam
మక్తల్‌ మండలం దాసర్‌దొడ్డి గ్రామానికి చెందిన ఆరేళ్ల ఉత్వేజ్‌కుమార్‌ నీటి డ్రమ్ములో పడి మృతి చెందాడు. తల్లిదండ్రులు కూలీ పనులకు వెళ్లగా, నానమ్మ బయటకు వెళ్లిన సమయంలో బాలుడు డ్రమ్ములో నుంచి నీరు తీసేందుకు వంగి ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడు. కొంతసేపటి తర్వాత నానమ్మ వచ్చి బాలుడిని బయటకు తీసినా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

Comments

G
Loading comments...