Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దాహం తీర్చుకోబోయి బాలుడు మృతి

Follow Udayam on Google
సతీష్ కుమార్ Jun 25, 2026 10:25 AM సిద్దిపేటGeneral
దాహం తీర్చుకోబోయి బాలుడు మృతి - Udayam
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొల్గూర్‌లో విషాదం చోటుచేసుకుంది. పొలం వద్ద డ్రిప్ పైపులో వస్తున్న నీటిని తాగిన 17 ఏళ్ల రాంచరణ్ అస్వస్థతకు గురై చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. ఆ నీటిలో పంటకు వేసే నానో యూరియా కలవడంతోనే బాలుడు మరణించాడని పోలీసులు తెలిపారు. ఒక్కగానొక్క కుమారుడిని కోల్పోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...