వార్తలకు తిరిగి వెళ్లండి

సారంగాపూర్ మండలం జేవులి గ్రామంలో ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసిన బోరును కొందరు సుమారు 10 ఇళ్లకు పైపులు వేసుకుని వినియోగిస్తున్నారని స్థానికులు తెలిపారు. ఇది ప్రజలందరి అవసరాల కోసం ఉద్దేశించిన బోరు అని వారు పేర్కొన్నారు.
మోటారు ఎక్కువసేపు నడపడంతో నీటి వృథాతో పాటు విద్యుత్ వినియోగం పెరుగుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ప్రభుత్వంపై అదనపు భారం పడుతోందని వారు తెలిపారు.
Comments
Loading comments...

