వార్తలకు తిరిగి వెళ్లండి

మర్రిగూడెం మండలం లెంకలపల్లి గ్రామంలో రైతులు బొప్పాయి తోటలో అంతర పంటగా బంతిపూల సాగు చేపట్టారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు, నీటి ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగు లాభదాయకంగా ఉంటుందని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు.
ప్రస్తుతం పండుగల సీజన్ కావడంతో బంతిపూలకు మంచి డిమాండ్ ఉందని, తద్వారా ఆదాయం ఆశాజనకంగా ఉంటుందని రైతులు భావిస్తున్నారు.
Comments
Loading comments...

