వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రావణమాసం సందర్భంగా బోర్ నర్సాపూర్ గ్రామంలో బుధవారం శ్రీ ముత్యాలమ్మ తల్లి బోనాల వేడుకలను గ్రామస్థులు నిర్వహించారు. మహిళలు, భక్తులు నెత్తిన బోనాలు పెట్టుకొని ఊరేగింపుగా ముత్యాలమ్మ తల్లి ఆలయానికి చేరుకున్నారు.
అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని భక్తులు ఆకాంక్షించారు. ఆలయం వద్ద భక్తుల సందడి నెలకొంది.
Comments
Loading comments...

